Social Media Influencer Tanu Sri Arrested for Cheating: ఈ రోజుల్లో సైబర్ మోసాలు ఎంతగా పెరిగిపోయాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ చేతిలోకి వచ్చేసింది కదా అని ఆనందపడే లోపే ఆ టెక్నాలజీ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న వారు కూడా లక్షల్లో కనిపిస్తున్నారు. తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా 31 లక్షల 66 వేల రూపాయలు లూటీ చేసిన ఒక కిలాడీ టిక్ టాకర్  గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు దఫాలుగా ఎనిమిది నెలల కాలంలో 31,66 వేల రూపాయలు కొల్లగొట్టిన ఒక కిలాడీ లేడీ గురించి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఒక యువకుడు. పోలీసులు రంగంలోకి దిగి ఫిర్యాదు మీద సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిగితే సదరు కిలాడీ లేడీ బయటకొచ్చింది. మచిలీపట్నానికి చెందిన పరసా తనుశ్రీ సోషల్ మీడియాలో టిక్ టాక్ లు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది.


టిక్ టాక్ బాన్ అయిన తర్వాత ఇంస్టాగ్రామ్ లో కూడా పలు పాటలకు, లిప్ సింక్ వీడియోలకు పర్ఫామెన్స్ లు ఇస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ వచ్చింది. 1) sritinsu 2) sri.tinsu 3) sri_tinsu 4) lucky_sritinsu అనే నాలుగు అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఆమె రెచ్చిపోయింది. ఆమె అందానికి ఫిదమైన వారెవరైనా కామెంట్ పెడితే వెంటనే వాళ్ళకి ఇన్బాక్స్లో మీరు కూడా నాకు నచ్చారు పెళ్లి చేసుకుందామా అంటూ మాట కలిపేది.


అలా మాట కలిపి ఒక వ్యక్తితో ఏకంగా 31 లక్షల 66 వేల రూపాయలు అకౌంట్ లో వేయించుకుంది. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, తన ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం హాస్పిటల్ కి కడుతున్నానని చెబుతూ 31 లక్షల 66 వేల రూపాయలను కాజేసింది. అయితే నిజానికి ఆమె మరో వ్యక్తితో లివింగ్ రిలేషన్ లో ఉంటూ లగ్జరీ లైఫ్ కు అలవాటు పడింది. ఆ ఖర్చులను ఇలా పలువురు దగ్గర నుంచితన పార్ట్నర్  రాబట్టినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను, ఆమెకు సహకరించిన ఆమె పార్ట్నర్ ను అరెస్ట్ చేసి రెండు సెల్ ఫోన్లు పలు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.


కేవలం ఒక్కరి దగ్గర నుంచే కాదని తనను పెళ్లి చేసుకుంటానని కామెంట్ పెట్టిన చాలామంది దగ్గర నుంచి తన డబ్బులు కాజేశానని తనుశ్రీ ఒప్పుకుంది. ఆమెకు నాలుగు అకౌంట్లు ఉండగా అందులో ఒక అకౌంటుకు 60 వేల మంది ఫాలోవర్లు కూడా ఉండడం గమనార్హం. సో అబ్బాయిలు సోషల్ మీడియాలో పెళ్లి చేసుకుంటాను అంటూ ఎవరైనా కామెంట్ చేస్తే పొంగిపోయి రిప్లై ఇవ్వకండి ఇలాంటి కిలాడీ లేడీలు మీ కొంప ముంచే అవకాశం ఉంది.


Also Read: Actress Ramya : మొన్న సమంత, రష్మిక.. ఇప్పుడు దీపిక.. అందుకే వారిని టార్గెట్ చేశారంటున్న హీరోయిన్!


Also Read: Accident : బాలకృష్ణ సినిమా యూనిట్ కు యాక్సిడెంట్… నలుగురు ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.